TTD: టీటీడీ సిబ్బందిపై సినీ నటి అర్చనా గౌతమ్ దాడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. ఇది హేయమైన చర్యగా అభివర్ణించింది. తప్పుడు ఆరోపణలతో ఉద్యోగులపై దుష్‌ప్రచారం చేయడాన్ని తప్పుపట్టింది. ఈమేరకు టీటీడీ ట్వీట్ చేసింది. పూర్తి వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. తిరుమల కొండపై ఏం జరిగిందన్న దానిపై స్పష్టత ఇచ్చింది. యూపీకి చెందిన నటి అర్చనా గౌతమ్..శివకాంత్ తివారి, మరో ఏడుగురితో కలిసి గతనెల ఆగస్టు 31న తిరుమలకు వచ్చారని టీటీడీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రమంత్రి సిఫార్సు లేఖతో వచ్చారని..అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసింది. ఐతే శివకాంత్‌ తివారితోపాటు నటి అర్చనా గౌతమ్ ఈవో కార్యాలయానికి వచ్చారని..విచక్షణ కోల్పోయి కార్యాలయ సిబ్బందిపై దుర్భాషలాడారని వెల్లడించారు. సర్ది చెప్పిన ఉద్యోగిపై చేయి చేసుకున్నారని ట్విట్టర్‌ ద్వారా టీటీడీ క్లారిటీ ఇచ్చింది. 


అర్చనా, తివారి చేస్తున్న వీరంగాన్ని టీటీడీ సిబ్బంది చూస్తూ ఊరుకున్నారని..ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. చివరకు అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది జోక్యం చేసుకుని..రెండోసారి రూ.300 టికెట్లు కేటాయించారని తెలిపారు. ఐనా వారు తగ్గలేదని..తీసుకునేందుకు నిరాకరించారని తేల్చి చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి టు టౌన్ పీఎస్‌లో తనపై చేయి చేసుకున్నారని తప్పుడు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. 


దీనిపై అదనపు ఈవో కార్యాలయ సిబ్బందిని పిలిపించి విచారణ చేపట్టారన్నారు. సిబ్బంది తీసిన వీడియో ద్వారా నటి దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. దీంతో ఆమె వెనక్కి తగ్గి వెళ్లిపోయారని తెలిపారు. సెస్టెంబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కావాలంటే రూ.10 వేల 500 చెల్లించి పొందవచ్చని సిబ్బంది సలహా ఇచ్చారని ట్విట్టర్‌ ద్వారా టీటీడీ క్లారిటీ ఇచ్చింది. దీనికి తప్పుడుగా టికెట్‌ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశారని ఆరోపించారని స్పష్టం చేశారు. 


తాను సెలబ్రిటీనని ఏం చెప్పినా చెల్లుతుందన్న దానితో అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఫైర్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా క్షమాపన చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.



Also read:Asia Cup 2022: కోహ్లీ ఎప్పటికీ రన్‌ మిషనే..విరాట్‌పై భారత మాజీ స్టార్ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also read:Birds Nest in House: ఇంట్లో పక్షుల గూళ్లు ఉంటే అరిష్టమా? మంచిదా? వాస్తు నిపుణుల సలహా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి