Asia Cup 2022: కోహ్లీ ఎప్పటికీ రన్‌ మిషనే..విరాట్‌పై భారత మాజీ స్టార్ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు అంతా టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Written by - Alla Swamy | Last Updated : Sep 5, 2022, 04:29 PM IST
  • ఆసియా కప్‌ 2022
  • కొనసాగుతున్న సూపర్-4
  • కోహ్లీపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Cup 2022: కోహ్లీ ఎప్పటికీ రన్‌ మిషనే..విరాట్‌పై భారత మాజీ స్టార్ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ అతడు వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలతో అలరించాడు. హాంకాంగ్‌పై 59, పాక్‌పై 60 పరుగులు సాధించాడు. ఈనేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడని తెలిపాడు.

ఐతే అతడి అభిమానులు ఎక్కువగా ఆశించడం వల్లే అతి పెద్ద సమస్యగా మారిందన్నాడు. క్రీజులోకి వచ్చిన ప్రతిసారి సెంచరీ చేయాలని కోరుతున్నారని..అందుకే ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా టచ్‌లో లేడనే పదం వినిపిస్తోందన్నారు వీరేంద్ర సెహ్వాగ్. విరాట్ కోహ్లీ నుంచి ఎక్కువగా ఆశించాం..బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి భారీ స్కోర్ సాధించాలని..సెంచరీ చేయాలని కోరుకున్నామని..సచిన్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడా..లేదా అని చర్చించుకున్నామని తెలిపాడు.

ఐతే ఎప్పుడైతే అతడు 40, 50 పరుగులకు ఔట్ కావుతుండటంతో అప్పటి నుంచి ఆ అంచనాలను వేయలేకపోతున్నామని చెప్పాడు సెహ్వాగ్. దీని బట్టి కోహ్లీ ఫామ్‌లో లేడని భావించామన్నాడు. కానీ తనకు మాత్రం అతడు ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నట్లు కనిపించాడని స్పష్టం చేశారు. ఐతే మంచి ఆరంభాలను మాత్రం భారీ స్కోర్‌లుగా తీర్చిదిద్దడంలో విఫలమాయ్యాడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ సూపర్ అని అన్నాడు.

రోహిత్, రాహుల్ మంచి ఆరంభం ఇచ్చినా..ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారని తెలిపాడు. ఈసమయంలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేయడం మాములు విషయం కాదన్నాడు. త్వరగా అతడు ఔట్ అయ్యి ఉంటే భారత్ 150 పరుగులు మాత్రమే చేసేదని చెప్పాడు. తక్కువ స్కోరుకే ఔట్ అయితే అతడు ఫామ్‌లో లేడని చెప్పొచ్చు అని..కానీ కోహ్లీ పరుగులు చేస్తున్నా..సెంచరీ చేయలేకపోతున్నాడన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. అందుకేనేమో అందరీ అంచనాలను కోహ్లీ అందుకోలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. 

మరోవైపు ఆసియా కప్ కీలక దశకు చేరుకుంది. సూపర్-4లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు బోణీ చేశాయి. రేపు(మంగళవారం) శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇకపై రెండు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. మ్యాచ్‌ ఓడితే మాత్రం ఇంటికి పోక తప్పదు. సూపర్-4లో టాప్‌లో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి.

Also read:Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం సోరెన్..ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు..!

Also read:Asia Cup 2022: రేపే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌..శ్రీలంకతో కీలక పోరు..తుది జట్లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News