కేంద్రం ఎట్టకేలకు ఏపీ సర్కార్ డిమాండ్లలో ఒక దానిని ఆంగీకరించింది. తిరుమల తిరుపతి దేవాలయానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. జీఎస్టీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి మినహాయింపు నిస్తూ కేంద్రం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సేవా భోజ్ యోజన పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదం అందించే ఆలయాలకు కేంద్రం జీఎస్టీ మినహాయింపులు ఇస్తుండగా.. అన్న ప్రసాదాల కోసం టీటీడీ కొనుగోలు చేసే ముడిసరుకులపై జీఎస్టీ మినహాయింపులు ఇస్తునట్లు జీవో/ఉత్తర్వుల్లో పేర్కొంది. జీఎస్టీ మినహాయింపు వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా రూ.35 కోట్లు ఆదాయం చేకూరుతుంది. కేంద్రం జీఎస్టీ నుంచి తిరుమల ఆలయానికి మినహాయింపు ఇవ్వడం పట్ల టీటీడీ పాలక మండలి హర్షం వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి తిరుమల సమాచారం:


తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.  శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోందని సమాచారం. కాలినడక దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 93,489 మంది భక్తులు దర్శించుకున్నారు.