Tirumala Darshanam Letters: తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం విషయంలో ఎమ్మెల్యేలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. స్వామి దర్శనం కోసం ఎమ్మెల్యేలకు మరింత వెసులుబాటు కల్పిస్తోంది. ఇక నుంచి ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో ఇకపై ఎమ్మెల్యేల లాబీయింగ్ మరింత పెరగనుంది. స్వామి  ప్రత్యేక దర్శనం కోసం ఎమ్మెల్యేలకు మరింత వెసులుబాటు లభిస్తోంది. తిరుమల దర్శనాల విషయంలో ఎమ్మెల్యేల కోటా పెరుగుతోంది. ఇప్పటి వరకూ స్వామివారి దర్శనం కోసం ఎమ్మెల్యేల లేఖలకు వారంలో నాలుగు రోజులు మాత్రమే అవకాశముండేది. ఇకపై వారంలో ఆరు రోజులు ఎమ్మెల్యేల లేఖలకు ఆస్కారం ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేలతో ఇవాళ సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల స్వామి దర్శనం సిఫార్సు లేఖల కోటా పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి వారంలో ఆరు రోజులు రోజుకు ఆరు చొప్పున సుపథం అంటే 300 రూపాయ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 


వాస్తవానికి తిరుమల లడ్డూ వ్యవహారం తరువాత తిరుమలలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, అందరికీ ఒకే దర్శనం ఉండేలా చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనలు విన్పించాయి. సోషల్ మీడియా సాక్షిగా చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు ఉండకూడదని విజ్ఞప్లులు వచ్చాయి. కానీ ఇందుకు భిన్నంగా సిఫార్సుల లేఖల్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.


Also read: Cyclone Alert: ఏపీను ముంచెత్తనున్న భారీ వర్షాలు, మరో అల్పపీడనం తుపానుగా మారనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.