చెన్నై: తిరుపతి ఎంపీ, వైసిపి నేత బల్లి దుర్గాప్రసాద్‌ రావు (64) ఇక లేరు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొవిడ్-19 చికిత్స ( COVID-19 ) పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు ( Heart attack ) వచ్చిందని.. ఈ కారణంగానే ఆయనను రక్షించుకోలేకపోయామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. Also read : Zee Hindustan App: ఒకే మొబైల్ యాప్‌.. ఐదు భాషల్లో నాన్-స్టాప్ అప్‌డేట్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్‌ రావు.. గతంలో నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్‌ 1985లో రాజకీయాల్లో చేరి 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన అంచలంచలుగా ఎదుగుతూ 1994లో చంద్రబాబు హయాంలో మంత్రిగానూ రాష్ట్రానికి సేవలు అందించారు. Also read : Telangana: అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా


ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సంతాపం:
మాజీ మంత్రి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. Also read :  Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR