RDIF and Dr Reddy’s lab to partner for Covid-19 vaccine trials, supply: న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ (Sputnik V) అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఆ తర్వాత ఈ స్పూత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి కూడా విడుదల చేసింది రష్యా. ఈ క్రమంలోనే ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ( RDIF) బుధవారం కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ఈ స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తి సరఫరాకు ఆర్డీఐఎఫ్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (Dr. Reddy’s Laboratories) తో బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు ఆర్డీఐఎఫ్.. వంద మిలియన్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. Also read: US Elections: ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?
#DrReddysNews: Russian Direct Investment Fund (RDIF) and Dr. Reddy’s to cooperate on clinical trials and supply of 100 million doses of Sputnik V vaccine to India. Read more here: https://t.co/BTaSkkcuri pic.twitter.com/8WeMyJGUsT
— Dr. Reddy's (@drreddys) September 16, 2020
అయితే.. భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ట్రయల్స్‌తోపాటు సరఫరాను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేపట్టనుంది. ఈమేరకు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తోపాటు.. ఫార్మా దిగ్గజం రెడ్డీస్ ల్యాబ్ కూడా ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమాలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంయుక్తంగా తయారుచేశాయి. క్లినికల్ ట్రయల్స్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన తరువాత.. కరోనావైరస్ నివారణకు ప్రపంచంలో స్పుత్నిక్ వీ తొలి వ్యాక్సిన్‌ను సిద్ధం చేసినట్లు గత నెల ఆగస్టు 11న రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. Also read: Japan New PM: జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా ఎన్నిక