ఏపీలో కరోనా వైరస్ ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి  (Bhumana Karunakar Reddy)మరోసారి కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యే భూమనకు కరోనా సోకడం ఇది రెండోసారి (Bhumana Karunakar Reddy Tests positive for coronavirus). రాష్ట్రంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకడం ఇదే తొలి కేసు కావడం గమనార్హం. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆగస్టు నెల చివర్లో తొలిసారి కరోనా పడి చికిత్స అనంతరం కోలుకోవడం తెలిసిందే.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తాజాగా రెండోసారి కోవిడ్19 పాజిటివ్ తేలినట్లు సమాచారం. కొద్దిరోజుల కిందట ఆయన కుమారుడికి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో భూమన ఆరోగ్యంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారి నుంచి కోలుకున్నారు.



కాగా, పలు అధికార కార్యక్రమాలలో హాజరు అవుతున్న నేపథ్యంలో మరోసారి భూమనకు కరోనా సోకిందని వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయనతో నేరుగా టచ్‌లో ఉన్న వారు కోవిడ్19 టెస్టులు చేయించుకోవడం బెటర్. ఐసోలేషన్‌లో ఉండటం తప్ప కరోనాకు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe