Owaisi: మరోసారి తిరుమలపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. టీటీడీ చైర్మన్ ను టార్గెట్ చేస్తూ..
Owaisi Senstional comments on TTD : హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైపీ మరోసారి తిరుమల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా తిరుమల బోర్డ్ ను వక్ఫ్ బోర్డ్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Owaisi Senstional comments on TTD: దేశంలో ముస్లిమ్స్ కు తానే ప్రతినిధి అని చెప్పుకునే అసదుద్దీన్ తాజాగా మరోసారి తిరుమల పై సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతున్నాయి. తాజాగా తిరుమల తిరుపతికి ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త చైర్మన్ తో పాటు పాలక మండలిని దీపావళి సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. టీటీడీ బోర్డ్ చైర్మన్ గా టీవీ 5 ఛానెల్ చైర్మన్ బీర్ ఆర్ నాయుడును చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది.
తిరుపతికి చెందిన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో ప్రక్షాళన చేస్తామన్నారు. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు దేవుడిపై నమ్మకం లేని వాళ్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతున్నారు. తిరుమల తిరుపతిలో కేవలం హిందువులకు మాత్రమే స్థానం ఉండాలని చెబుతున్నారు.
కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం వక్ఫ్ బోర్డ్ తో పాటు వక్ఫ్ కౌన్సిల్ లో నాన్ ముస్లిమ్ లకు చోటు కల్పిస్తూ బిల్లు రెడీ చేసింది. మన దేశంలో హిందూ దేవాలయాలకు ఒక న్యాయం. ముస్లిమ్స్ కు మరో న్యాయమా.. అని మండిపడ్డారు. గతంలో ఒవైసీ తిరుమల లడ్డూ కల్తీపై తనదైన శైలిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపి హిందూ మనోభావాలను దెబ్బ తీయడాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తిరుమల బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను వక్ఫ్ బోర్డ్ కు ముడిపెడుతూ.. మోకాలికి బోడి గుండుకు లింకు పెడుతున్నారంటూ నెటిజన్స్ ఒవైసీ తీరుపై మండిపడుతున్నారు. ఒవైసీ .. రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చి వేతలపై కూడా మండిపడిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter