TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ దర్శన్ కోటా టిక్కెట్స్ ఇలా బుక్ చేసుకోండి..
Tirumal Darshan Tickets Release For December 2024: తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి నెల దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ బోర్ట్ ఈ నెల 19 నుంచి భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకు రానుంది.
Tirumal Darshan Tickets Release For December 2024: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల కోటా కింద రూ. 300 దర్శనం టికెట్స్ తో పాటు.. పలు ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ, వసతి గృహాలకు సంబంధించిన ఆన్ లైన్ కోటా విడుదల చేస్తుంది. డిసెంబర్ మంత్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా భక్తులు ఆన్ లైన్ లో వివిధ సేవలకు సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి ఆన్ లైన్ లో వివిధ సేవలకు సంబంధించి టికెట్స్ అందుబాటులో ఉంచుతుంది.
వివిధ ఆర్జిత సేవా టికెట్లను ఎలక్టానిక డిప్ కోసం ఈ నెల 21వ తేదిన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ టికెట్లు ఈనెనల 21 నుంచి 23వ తేది మధ్య 12 గంటల లోపు వివిధ సేవలకు సంబంధించిన డబ్బును ఆన్ లైన్ లో పేమెంట్ చేసినవారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయి. మరోవైపు తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, శ్రీవారి కల్యాణోత్సవం, సహప్ర దీపాలంకరణ సహా పలువు సేవా టికెట్లు ఈ నెల 23వ తేది ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్లను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవాణి ట్రస్టుకు కు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ కోటాను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 60 యేళ్ల పైబడిన వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీవారి ఉచిత ప్రత్యేక దర్శనాల కోసం సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
ఈ నెల 28న తిరుమల శ్రీవారి సేవ కోటా టికెట్లను ఉదయం 11 గంటలకు.. నవనీత సేవలకు సంబంధించి
మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆన్ లైన్ విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthaams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారికి సంబంధించిన వివిధ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.