నేటితో నామినేషన్లు క్లోజ్, క్యూకడుతున్న అభ్యర్ధులు
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ గడువులోపు వచ్చి టోకెన్ తీసుకున్న అభ్యర్థులందకే నామినేషన్లు స్వీకరించనున్న ఎలక్షన్ కమిషన్
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ గడువులోపు వచ్చి టోకెన్ తీసుకున్న అభ్యర్థులందరి నామినేషన్లు స్వీకరిస్తామని ఈసీ ప్రకటించింది.
క్యూ కడుతున్న అభ్యర్ధులు...
ఈ నెల 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సెలవులు పోగా 4 రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ జరిగింది. 21న హోలీ పర్వదినం .. అలాగే 23, 24 సెలవులు రావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంకా నామినేషన్ల వేయని అభ్యర్ధులు..ఈ పని పూర్తి చేసేందకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద క్యూడుతున్నారు. దీంతో రిటర్నింగ్ కేంద్రాల దగ్గర సందడి నెలకొననుంది.
భారీ స్థాయిలో నామినేషన్లు...
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాలైనట్లు తెలిసింది. ఏపీ విషయానికి వస్తే 25 లోక్ సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతున్నందున్న ఆయా స్థానాల్లో ఇప్పటి వరకు మొత్తం 862 నామినేషన్లు దాఖలయ్యాలైనట్లు తెలిసింది. సోమవారం చివరిరోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తైతే...
నామినేషన్లకు దాఖలు ప్రక్రియ పూర్తైతే... మార్చి 26వ తేదీ నుండి నామినేషన్లను అధికారులు పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.