భీమవరం: వైఎస్సార్ సీపీ నేత, టాలీవుడ్ నటుడు కృష్ణుడు (అల్లూరి కృష్ణంరాజు) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న  కృష్ణుడు తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం (జనవరి 13న) కన్నుమూశారు. కొన్నిరోజులుగా భీమవారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారామరాజు నేడు తుదిశ్వాస విడిచారు. కృష్ణుడి తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు కుటుంబానికి  వైఎస్సార్ సీపీ నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమీందార్ల కుటుంబానికి చెందిన కృష్ణుడు పలు తెలుగు సినిమాల్లో నటనతో గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ పార్టీలో చేరి ప్రచారం చేశారు. గతంలో కృష్ణుడు కుటుంబానికి వేల ఎకరాలవరకు భూములుండేవి. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ జమీందార్ అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు కృష్ణుడుకి ముత్తాత అవుతారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ చట్టం కారణంగా వీరి భూములు ప్రభుత్వపరం అయ్యాయి.


రాజకీయ నేపథ్య కుటుంబం
కృష్ణుడు పెదనాన్న ఏవీ సూర్యనారాయణ రాజు పాతికేళ్లపాటు రాజోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. సూర్యనారాయణ రాజు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి పలు సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో హీరోగాను మెప్పించాడు కృష్ణుడు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం కావడంతో గతేడాది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..