Tollywood: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఏపీ సినిమా టికెట్ల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో చిరంజీవి నేతృత్వంలో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ను ఎవరెవరు కలిశారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గత కొద్దికాలంగా నెలకొన్న సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలు, టికెట్ ధరల విషయంపై ఇవాళ అత్యంత కీలకమైన భేటీ కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ దిగ్గజాలు రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ, మహేశ్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు. 


తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు టికెట్ ధరల వివాదం, జీవో నెంబర్ 35లో సవరణలు, ఏసీ - నాన్ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ట టికెట్ ధరల వ్యవహారం, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆహారపదార్ధాల ధరలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. థియేటర్ల వర్గీకరణ, ధరల పెంపుపై ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికపై ఇవాళ సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి జగన్ (Ap cm ys jagan) మధ్య చర్చ జరగనుంది. కరోనా థర్డ్‌వేవ్ తగ్గుముఖం పట్టడం, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినీ పరిశ్రమ మొత్తం ఇవాళ్టి సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలన్నీ కొలిక్కి రావచ్చు. 


ప్రత్యేక విమానంలో మహేశ్ బాబుకు చిరంజీవి పుష్పగుఛ్చంతో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో  సమావేశం సందర్భంగా కొన్ని ఫోటోల్ని విడుదల చేశారు. 


Also read: Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీకు అంతా సిద్ధం, లోగో విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook