CM Jagan Tour: ఏపీలో రైతులకు శుభవార్త..రేపే ఖరీఫ్ పంటల బీమా పరిహారం అందజేత..!
CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు శ్రీసత్య సాయి జిల్లా వేదిక కానుంది. రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి వేయనున్నారు.
రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలు దేరి..ఉదయం 10.20 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నేకొత్తపల్లికి బయలుదేరుతారు. ఉదయం 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లికి వెళ్తారు. మొదట వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎం జగన్ చర్చిస్తారు. అనంతరం బహిరంగసభ దగ్గరకు వెళ్తారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు సభలోనే ఉంటారు. బహిరంగసభ అనంతరం రైతులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు సీఎం. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. సభాస్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also read:Thalapathy 66: లీకైన విజయ్, రష్మిక షూటింగ్ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్...
Also read:CM Jagan review on Health: వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష..అధికారులకు దిశానిర్దేశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.