Thalapathy 66: లీకైన విజయ్, రష్మిక షూటింగ్ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్...

Thalapathy Vijay 66 Photos Leaked: తళపతి విజయ్ 66వ సినిమాకు ఆదిలోనే షాక్స్ తగులుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి హీరో, హీరోయిన్ ఫోటోలు లీకయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 01:43 PM IST
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తళపతి విజయ్ 66వ సినిమా
  • ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్
  • షూటింగ్ స్పాట్ నుంచి హీరో, హీరోయిన్ ఫోటోలు లీక్
Thalapathy 66: లీకైన విజయ్, రష్మిక షూటింగ్ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్...

Thalapathy Vijay 66 Photos Leaked: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తళపతి విజయ్ 66వ మూవీని షూటింగ్ దశలోనే లీకుల బెడద వెంటాడుతోంది. హైదరాబాద్‌లోని షూటింగ్‌ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ షాక్ తిన్నారు. ఇకపై షూటింగ్ స్పాట్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతించవద్దని వంశీ పైడిపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లీకైన షూటింగ్ ఫోటోల్లో తళపతి విజయ్ జీన్స్, షర్ట్‌లో.. ఆయన వెనకాలే రష్మిక మందన్నా టాప్స్‌ ధరించి కనిపిస్తున్నారు. హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో షూటింగ్ సందర్భంగా ఎవరో ఈ ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది. ఆదివారం (జూన్ 12) నుంచే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలామంది నెటిజన్లు ఈ ఫోటోలను విరివిగా షేర్ చేస్తున్నారు. లీక్స్‌తో షాక్ తిన్న చిత్ర యూనిట్.. ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయ్-రష్మిక జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Also Read: Whatsapp Pay Cashback: వాట్సాప్ యూజర్స్‌కు రూ.105 క్యాష్ బ్యాక్ ఆఫర్.. ఎలా పొందాలో తెలుసుకోండి

Also Read: CM Jagan review on Health: వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష..అధికారులకు దిశానిర్దేశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News