AP Wine Shops Close: ఆంధ్రప్రదేశ్‌లో మద్యంప్రియులకు మరో షాకింగ్‌ వార్త. రేపు గురువారం మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఉన్నఫళంగా ఎందుకు వైన్స్‌ మూతపడనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే మద్యం దుకాణాలు కొన్ని చోట్ల మాత్రమే తాళం పడనున్నాయి. అన్ని చోట్ల కాకుండా కొన్ని ప్రాంతాల్లో వైన్స్‌ను మూసి వేయాలని ఏపీ ఎక్సైజ్‌ శాఖ సూచించింది. టీచర్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ సందర్భంగా ఈ దుకాణాలు మూసివేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: చంద్రబాబు పాలనలో వరదలా పారుతున్న మద్యం.. బెల్టుషాపు లేని వీధి, గ్రామం లేదు


ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అకాల మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఉప ఎన్నికకు రేపు అంటే గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు అల్లూరి జిల్లాలోని 11 మండలాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు.

Also Read: Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత


ఇప్పటికే బుధవారం మద్యం దుకాణాలు మూతపడగా.. గురువారం కూడా మద్యం దుకాణాలను అధికారులు మూసి వేయనున్నారు. అయితే మద్యం దుకాణాలు మూసివేయడంతో కొందరు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తుండడంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజమండ్రిలోని లాలాచెరువు వద్ద ఓ వైన్ షాప్ వెనుక రెండు రోజుల పాటు అక్రమంగా అమ్మేందుకు భారీగా స్టాక్ పెట్టుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 50 బాక్సుల మద్యం, బీరు బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. సుమారు రూ.3.79 లక్షల మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ తూర్పుగోదావరి జిల్లా అధికారి సౌజన్య వెల్లడించారు. గురువారం సాయంత్రం వరకు డ్రై డే కఠినంగా అమలు చేసేందుకు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు ఉమ్మడి జిల్లాలలో 116 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఓటర్లు 16,737 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మండలానికి ఒకటి, అర్బన్ ప్రాంతంలో మండలానికి రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కాకినాడ డీఆర్ఓ వెంకట్రావు వెల్లడించారు. కాగా ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.