విశాఖ రసాయన కంపెనీలో గ్యాస్ లీక్.. ఒక్కో కుటుంబంలో క్రమక్రమంగా విషాదం నింపుతోంది.  ఇవాళ (గురువారం) ఉదయం 5గా ఉన్న మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో  ప్రాణాలతో పోరాడుతున్నవారు ఒక్కరొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు వెయ్యి మంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. అందులో తక్కువ ప్రభావితులైన కొంత మందిని ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జి చేశారు. ఐతే తీవ్రంగా ప్రభావితమైన వారు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారు. ఇప్పటి వరకు గ్యాస్ లీక్  కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. అంతే కాకుండా 20 నుంచి 25 మంది పరిస్థితి విషమంగా ఉందని జాతీయ విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ జనరల్ S.N ప్రధాన్ తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.


మరోవైపు ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లో ప్రస్తుత  పరిస్థితి అంచనా వేసేందుకు పుణే నుంచి NDRFకు చెందిన కెమికల్, బయాలాజికల్, న్యూక్లియర్  బృందాలు రానున్నాయి. పుణేలోని NDRF కమాండెంట్ అనుపమ్ శ్రీవాత్సవ నేతృత్వంలోని  5వ బెటాలిన్ వీలైనంత త్వరగా విశాఖ చేరుకోనుంది. 


అటు విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్..NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. స్టైరైన్ గ్యాస్ కారణంగా తలెత్తిన పరిస్థితిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..