COVID-19: ఏపీలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది.
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది. అందరూ కలిపి కొత్తగా 351 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,555కు చేరింది. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు కలిపి రాష్ట్రంలో మొత్తం 7071 మందికి కరోనా సోకింది.
( భారత్‌లో ఒక్కరోజే 2000కు పైగా కరోనా మరణాలు )
కరోనా సోకిన వారిలో గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 90కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం తాజా హెల్త్ బులెటిన్‌ని విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనావైరస్ నుంచి కోలుకుని 2,906 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..