ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ( Ap cm ys jagan ) చేపట్టిన నాడు నేడు కార్యక్రమం కేవలం నామమాత్రానికి కాదన్పించుకుంటోంది. ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్చే కార్యక్రమంల ో భాగంగా చేపట్టిన నాడు నేడు సత్ఫలితాలనిస్తోంది. కృష్ణా జిల్లాలోని ఆ స్కూల్ ఫోటోలు చూస్తే అదే అన్పిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దుకున్నదే నాడు నేడు కార్యక్రమం ( Nadu nedu program ) . ప్రభుత్వ స్కూళ్లు నిన్నటి వరకూ ఎలా ఉండేవి..ఇప్పుడెలా ఉంటున్నాయి అనేది స్పష్టంగా ప్రజలకు చూపించే ప్రయత్నమే ఇది. స్కూళ్ల వాతావరణంలో మార్పు, రూపురేఖల్లో మార్పు, టీచింగ్, సదుపాయాల్లో మార్పు ఇలా అన్ని విధాలా స్కూళ్లను తీర్చిదిద్దడమే నాడు నేడు కార్యక్రమం ఉద్దేశ్యం. Also read:AP: చంద్రబాబుది పైశాచిక ఆనందం: మంత్రి ఆళ్లనాని


ఇప్పుడు రాష్ట్రంలో చాలా స్కూళ్లు నాడు నేడులో భాగంగా రూపాంతరం చెందుతున్నాయి. విద్యావ్యవస్థకు జవసత్వాలు వస్తున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( ycp leader Sajjala ramakrishna reddy ) ట్వీట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలందరికీ అత్యుత్తమ విద్య అందబోతోందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నులోని ఓ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ ఫోటోలు. గతంలో ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉంది అనేది ఈ ఫోటోతో స్పష్టంగా తెలుస్తుంది. Also read: AP: హామీ ఇచ్చిన గంటల్లోనే ట్రాక్టర్ అందించిన సోనూ సూద్