అమరావతి: గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ( TTD lands auction issue ) టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ( TTD board Chairman YV Subba Reddy ) ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. చదలవాడ కృష్ణమూర్తి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆస్తుల వేలం వేయాలని నిర్ణయించారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ టీటీడీ భూములను వేలం వేశారన్నారు. తాము కొత్తగా ఏమీ చేయడం లేదన్నారు. దీనిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. 1974 నుంచే టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నారన్నారని ఇప్పటివరకు దాదాపు 142 ఆస్తులను విక్రయించారని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ( అమ్మకానికి శ్రీవారి ఆస్తులు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"186041","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


టీటీడీ భూములను అమ్మాలని తాము బోర్డు మీటింగ్‌లో నిర్ణయించలేదని చెప్పిన ఆయన.. వేలానికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని మాత్రమే తాము తీర్మానం చేశామని తెలిపారు. ఏదేమైనా భూముల వేలంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. కొందరు కావాలనే ఇప్పుడు ఎందుకు సమస్యను పెంచుతున్నారో, వారు మాత్రమే చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మం మీద నమ్మకం ఉన్న వారు భగవంతుడిని ఆరాధిస్తారని, నమ్మకం లేని వారు దేవుని పేరు మీద రాజకీయం చేస్తారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తమపై ఇన్నాళ్లూ వ్యక్తిగతంగా విమర్శలు చేసినా సహించామని, ఇక ఇప్పుడు ఆఖరికి దేవుడిపైనే నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను దేవుడి సేవకే వచ్చానని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..