Tirumal Tirupati Devasthanam News: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపికబురు అందించింది. సోమవారం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారంతో ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు అన్నమయ్య భవన్‌లో ఆఖరి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా ఆస్పత్రుల అభివృద్ధి పనులకు సంబంధించి భారీ మొత్తంలో నిధులను కేటాయించారు. పాలకమండలి భేటీ తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 కోట్ల రూపాయలతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షెడ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 4.5 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. రూ.23.50 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామన్నారు.


శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల కేటాయింపునకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.3.10 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. వకుళమాత ఆలయం వద్ద అభివృద్ధి పనులకు రూ.9.85 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. రూ.2.60 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు నిధులు కేటాయింపులకు ఆమోదం తెలిపామన్నారు. 


"SV ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్లు రూపాయలు కేటాయించాం. రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు ఖర్చు చేయనున్నాం.. SV సంగీత కళాశాల అభివృద్ధి పనుల కోసం రూ.11 కోట్ల వెచ్చించనున్నాం. తిరుపతిలోని వేశాలమ్మ, పెద్ద గంగమ్మ దేవాలయాల అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయింపులు జరిగాయి. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని టీడీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్లు పొడిగిస్తూ సభలో ఆమోదించాం. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపాం. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నాం.." అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు  


Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook