Ttd chairaman serious on former minster srinivas goud: తిరుమల ఇటీవల ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటుంది. కొన్నిసార్లు శ్రీవారి దర్శన  టికెట్లు, సదుపాయాలు, సేవాకార్యక్రమాల అంశాలతో వార్తలలో ఉంటే.. మరికొన్ని సార్లు.. ఏదో ఒక కాంట్ర వర్సీ అంశంతో వార్తలలో ఉంటుంది. ఈ క్రమంలో కొంత మంది నేతలు కూడా ఇటీవల పవిత్రమైన తిరుమలకు వెళ్లి వివాదస్పదంగా మాట్లాడుతున్నారు. మరికొందరు రీల్స్ చేస్తు.. స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా కూడా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు సైతం.. సామాన్య భక్తులకు దర్శనం పరమావధిగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. ఎక్కడ కూడా దర్శనం కోసం వచ్చే భక్తులు, క్యూలైన్ లలోకానీ.. వసతుల సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే.. ఇటీవల తిరుమలలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలపై బీఆర్ నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తొంది.


పవిత్రమైన స్వామి వారి ఆలయ పరిసరాల్లో రాజకీయాలు, కాంట్రవర్సీ చర్యలను ఏమాత్రం ఊరుకునేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. వీరిపై పోలీసు కేసుల్ని సైతం నమోదు చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తొంది. తాజాగా, తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. అంతేకాకుండా.. అక్కడ స్వామివారి ఆలయం పరిసర ప్రాంతంతో మీడియాతో మాట్లాడారు.


తెలంగాణకు చెందిన భక్తులు, నేతలు, వ్యాపారవేత్తల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. తెలంగాణలో ఉండి.. వ్యాపారాలు చేసుకుంటు ఎక్కువగా ఆంధ్రవాళ్లే లాభపడ్డారని అన్నట్లు తెలుస్తొంది. దేవుడి ముందు అందరు సమానమే.. అని.. వివక్ష మానుకొవాలని శ్రీనివాస్ రెడ్డి కాంట్రవర్సీగా మాట్లాడారు.


Read more: Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా? టిక్కెట్లు, జారీ చేసే కౌంటర్లు ఇవే..


ఈ క్రమంలో దీనిపై తాజాగా.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ అయ్యారు. స్వామివారి ప్రతిష్టను భంగం కలిగే విధంగా ఎవరు మాట్లాడిన వదిలేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ పై శ్రీవారి భక్తులు కూడా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా పోలీసు కేసు కూడా నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.