Broadband Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ రెండు విభిన్నమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. వేగంతో పాటు అదనంగా ఓటీటీ ప్రయోజనాలు కలిగే ప్లాన్స్ ఇవి. ఈ ప్లాన్స్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 300 ఎంబీపీఎస్ స్పీడ్ కూడా ఉండటంతో డేటా విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే ఆలోచన ఉంటే మీ కోసం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రెండు ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్స్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ సేవలు ఉచితంగా పొందవచ్చు. జియో 1499 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అయితే..ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ రూపంలో లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ డేటాతో పాటు 300 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. అంతేకాకుండా ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉచితంగా ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 వందలకు పైగా టీవీ ఛానెల్స్ చూడవచ్చు. ఇక ఓటీటీ ప్రయోజనాలైతే అమోఘం. ఏకంగా 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందవచ్చు. ఇందులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లైట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ రెండేళ్లు వర్తిస్తుంది. ప్రీ పెయిడ్ కస్టమర్లు 3, 6, 12 నెలల ప్లాన్ ఎంచుకోవచ్చు. 12 నెలల ప్లాన్ అంటే ఏడాది ప్లాన్ తీసుకుంటే 30 రోజులు అదనంగా వ్యాలిడిటీ ఉంటుంది.
ఇక ఎయిర్‌టెల్ అందించే 1599 రూపాయల ప్లాన్‌లో కూడా అన్‌లిమిటెడ్ డేటా 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో లభిస్తుంది. ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉంటుంది. 350కు పైగా టీవీ ఛానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ యాక్సెస్ ఉచితంగా ఉంటుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా చూడవచ్చు. మొత్తం 12 ఓటీటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. ముందుగా 2500 రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తే ఫ్రీ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ డబ్బులు బిల్లులో అడ్జస్ట్ అవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.