TTD news these festivals and events in the month of august sravana masam 2024: ఆగస్టు నెలలో ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు ప్రసిద్ది చెందిన ఆలయాలకు ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మాసంగా చెప్తుంటారు. శ్రావణ మాసంలో జన్మాష్టమి, రాఖీపండుగ, వరలక్ష్మి వ్రతం, సోమవారం, శనివారరోజుల్లో పూజలు విశేషంగా నిర్వహిస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున ఆలయానికి వస్తుంటారు. దీంతో శ్రావణ మాసంలో పండుగ శోభ నెలకొంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక ప్రకటన జారీచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..  


ముఖ్యంగా తిరుమలతో శ్రీవారికి ఎల్లప్పుడు కూడా విశేష పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆగస్టు మాసం, శ్రావణం పురస్కరించుకుని తిరుమలలో జరిగే విశేష పూజలను గురించి అధికారులు ఈ విధంగా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.


అనేక కంపార్ట్ మెంట్ లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రావణ మాసంలో జరిగే విశేష పూజలు, ఉత్సవాల గురించి పూర్తి సమాచారం కింది విధంగా వెల్లడించారు.



తిరుమల శ్రీవారి ఉత్సవాలు వివరాలు..


ఆగష్టు నెల 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం నేపథ్యంలో.. శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం జరగనుంది.


ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తు నిర్వహిస్తారు


ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ జరగనుంది.


ఆగస్టు 10న కల్కి జయంతి, ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి నిర్వహిస్తారు.


ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.


ఆగస్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం, స్మార్త ఏకాదశి జరగనుంది.


ఆగస్టు 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.


ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం చేస్తారు.


ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి రోజున పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనుంది. అదే రోజు రాఖీ పండుగ హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు.


ఆగస్టు 20న తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు చేయనున్న టిటిడి గాయత్రీ జపం నిర్వహించనుంది.


ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం జరగనుంది.


ఆగ‌స్టు 28న శ్రీ‌వారి శిక్యోత్స‌వాన్ని టీటీడీ అధికారులు ఆగమన శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. 


పై కార్యక్రమాలను బట్టి స్వామి వారి సేవల్లో పాల్గొనదల్చిన భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కూడా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 


Read more: Coconut flower: వావ్.. కొబ్బరి పువ్వుతో కోటి ప్రయోజనాలు.. ఇవి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter