Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..

Sharavana mass festivals 2024: ఆగస్టు నెలలో ఐదో తేదీన శ్రావణ మాసం ప్రారంభమౌతుంది. ఈ మాసంలో అనేక పండుగలు వరుసగా వస్తుంటాయి. అదే విధంగా హిందువులు శ్రావణ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

1 /8

శ్రావణ మాసం.. అనేది శివుడితోపాటు, విష్ణువుకు కూడా ఎంతో ప్రీతీకరమైనమాసమని చెప్తుంటారు. అదే విధంగా అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమని పండితులు చెప్తుంటారు. అందుకు ఈనెలలో శివకేశవులతో పాటు, లక్ష్మీదేవీ పూజలను కూడా చాలా మంది చేసుకుంటారు.విష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రావణం. ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావించి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు.  

2 /8

శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం, శనివారం లను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆగస్ట్ నెలలో 19 న రాఖీ పౌర్ణమి  పండుగ వస్తుంది.  ఆగస్టు 26,27 తేుదీలలో.. శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు.  అదే విధంగా హరీయాలీ తీజ్, నాగ పంచమి కూడా ఇదే మాసంలో నిర్వహించుకుంటారు. ఆగస్టు 4 అమావాస్య..శ్రావణ మాసంకు ఒక రోజు ముందు అమావాస్యవస్తుంది.

3 /8

ఆగస్ట్ 7 న స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. దీన్నే మధు శ్రవ వ్రతం అంటారు. మహిళలు తమ భర్తల ఆరోగ్యం కోసం ఈ పూజలు చేస్తుంటారు. నాగ పంచమి ఆగస్టు 9 .. ఈరోజున మహిళలు ఉపవాసం ఉంటారు. పుట్టల దగ్గరకు వెళ్లి పాలను పొస్తుంటారు.  జంటనాగులను భక్తితో ప్రార్థనలు చేస్తుంటారు. ఈరోజు సోదరులకు కళ్లు కడుగుతుంటారు. దీని వల్ల సోదరుడికి ఉన్న దోషాలన్ని పోతాయని చెప్తుంటారు.  

4 /8

పుత్రదా ఏకాదశి ఆగస్టు 15.. ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు, పుత్రదా ఏకాదశికూడా వస్తుంది. ఈరోజున సంతానం లేని వారు విష్ణుదేవుడిని పూజిస్తే.. వెంటనే సంతానం కల్గుతుందని చెప్తుంటారు.

5 /8

వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16.. పెళ్లికానీఅమ్మాయిలు, పెళ్లైన మహిళలు  వరలక్ష్మీ వ్రతం ను భక్తితో ఆచరిస్తుంటారు. ఈ పూజలు చేయడం వల్ల మంచి  భర్తదొరకడంతో పాటు, భర్త ఎల్లప్పుడు ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉంటారని, కుటుంబంను అమ్మవారు చల్లగాకాపాడుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.  

6 /8

శ్రావణ పౌర్ణమి ఆగస్టు 19.. ఈరోజున సోదరులు తమ అక్కా, చెల్లెళ్ల దగ్గరకు వెళ్లి రాఖీలు కట్టుకుంటారు. దీని వల్ల సోదరులు, సోదరీమణుల మధ్యప్రేమ ఎల్లకాలం ఉంటుందని చెప్తుంటారు. సోదరుడికి రాఖీ కట్టగానే.. సోదరుడు ప్రేమతో తమ వారికి కానుకలు ఇచ్చి వారిని సంతోషపెడుతుంటాడు.

7 /8

జన్మాష్టమి ఆగస్టు 26, 27.. శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఈసారి రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు.ఈ వేడుకను సాయంత్రం అష్టమి తిథి ఉన్న సమయంలో నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల ఆచారంను బట్టి వేడుక నిర్వహిస్తారు.  

8 /8

అజ ఏకాదశి ఆగస్టు 29 .. ఆగస్టు 29 న వచ్చిన ఏకాదశిని అజ ఏకాదశిగా పిలుస్తుంటారు.  ఈరోజున చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. ఈ రోజున ఏ చిన్న పూజలు, వ్రతం చేసిన కూడా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)