TTD Darshan Tickets Booking: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వేచిచూస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా పరిమిత టికెట్లు విడుదల చేయడం వల్ల శ్రీవారి దర్శనం టికెట్లు విపరీతమైన డిమాండ్ పెరిగింది. లక్షల మంది భక్తులు ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam-TTD) వెబ్‌సైట్‌ లో ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో జనవరి నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం కోటాను (Srivari Darshan Booking) శుక్రవారం ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. వర్చువల్‌ క్యూ పద్ధతిలో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి టికెట్లను బుక్‌ చేసుకున్నారు. టికెట్లు విడుదల చేసిన 55 నిమిషాల్లోనే 4 లక్షల 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 


ఒకనొక దశలో దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా వెబ్‌సైట్‌కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొదటి 22 నిమిషాల్లోనే 3.20 లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులపాటు టికెట్ల సంఖ్యను రోజుకు 20 వేలకు పెంచారు. సర్వదర్శనం టికెట్లను ఎలా విడుదల చేయాలనే విషయంపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. 


జనవరిలో రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రోజు 5 వేలు ఆఫ్‌లైన్‌లో.. 5 వేలు ఆన్‌లైన్‌లో విడుదల చేయాలా లేక పూర్తిగా ఆఫ్‌లైన్‌లో విడుదల చేయాలా? అనే విషయమై సమీక్షిస్తున్నారు. ఒమిక్రాన్‌ పరిస్థితికి అనుగుణంగా సర్వదర్శనం టికెట్ల జారీని నిర్ణయించే అవకాశం ఉంది.


భక్తులు పాటించాల్సిన నిబంధనలు


శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని తితిదే కోరింది. 18 ఏళ్లలోపు వారు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తేవాలని సూచించింది. ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నా.. కొందరు భక్తులు తీసుకురాకపోవడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీచేసి వెనక్కి పంపుతున్నట్లు వెల్లడించింది.  


Also Read: Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు.. మొత్తంగా ఏపీలో 3 కేసులు నమోదు


ALso Read: Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కాలు జారీ కింద పడ్డ ఏపీ స్పీకర్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి