TTD Board Meeting Decisions: టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  తిరుమలలో అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్‌కు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ జీవో నెంబర్ 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని అలిపిరి వద్ద ఈ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. హోమంలో పాల్గోనే భక్తులు వెయ్యి రుపాయాలు చెల్లించి టికెట్ పొందాల్సి ఉంటుందన్నారు. హోమాన్ని నిరంతరాయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీటీడీలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు అందిస్తామన్నారు. ఉద్యోగుల ఇంటి స్థలాలకు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు 25.67 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులుకు రూ.6850 చెల్లిస్తామని తెలిపారు. తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ది పనులకు రూ.6.15 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.  
 
టీటీడీ పాలకమండలి కేటాయింపులు ఇలా..


==> ప్రసాదాలు, ముడిసరుకులు నిల్వ ఉంచడానికి రూ.11 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణం 
==> మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.15 కోట్లు కేటాయింపు
==> ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు కేటాయింపు
==> పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయింపు
==> ఆయుర్వేద హస్పిటల్‌లో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం
==> రుయాలో టీబీ రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణం
==> స్విమ్స్‌లో రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం
==> స్విమ్స్‌లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయింపు


Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?


Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి