Tungabhadra Gates: తుంగభద్ర 25 గేట్లు ఓపెన్.. కృష్ణా ప్రాజెక్టులకు వరద..
Tungabhadra Gates: ఈ యేడాది వానా కాలంలో కర్ణాటకతో పాటు ఏపీలో తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు చెందిన రెండు గేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మత్తుల నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ లోని నీటిని కిందికి విడిచారు.తాజాగా ఈ డ్యామ్ కు వరద పెరగడంతో 25 గేట్లు ఎత్తారు.
Tungabhadra Gates: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లూ (Inflow) వచ్చింది. దీంతో జెన్కో (Genco) విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇందుకోసం 34666 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 731, సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్టు- 2కు 750 క్యూసెక్కులు వదలారు. మరో 92 క్యూసెక్కులు ఆవిరైంది.
తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.830 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువన ఉన్న నారా యణపూర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో 25 గేట్లను ఎత్తి 35405 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 33.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.984 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో రెండు రోజుల్లో నారాయణపూర్ నుంచి విడుదలవుతున్న వరద నీరు జూరాలకు చేరే అవకాశం ఉంది. మొత్తంగా డ్యామ్ గేట్లు రిపేర్ తర్వాత తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter