Perni Nani Vs RGV: అటు మంత్రి పేర్ని నాని.. ఇటు దర్శకుడు రాంగోపాల్ వర్మ... ఇద్దరిలో ఎవరూ తగ్గట్లేదు. ఎవరి వాదనతో వారు ట్విట్టర్‌లో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ క్రమంగా హీటెక్కుతోంది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేనే లేదని వర్మ వాదిస్తుండగా... ఇష్టారీతిన ధరలు పెంచేసి సామాన్యులను దోపిడీ చేస్తామంటే కుదరదని మంత్రి పేర్ని నాని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆర్జీవీ ప్రశ్నలకు నాని ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా... తాజాగా వర్మ మళ్లీ రియాక్ట్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ .. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.' అని రాంగోపాల్ వర్మ మంత్రి పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు.


మీకు, మీ డ్రైవర్‌కు తేడా లేదా? : నానికి వర్మ ప్రశ్న


'నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా?' అని రాంగోపాల్ వర్మ పేర్ని నానిని ప్రశ్నించారు. 'కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్లకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేసే క్రైమ్.. ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది.' అని ప్రశ్నించారు. ముంబై, ఢిల్లీలో వారాన్ని బట్టి, థియేటర్‌ను బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ధరలు రూ.75 నుంచి రూ.2200 వరకు ఉంటాయని పేర్కొన్నారు.


అలా మీకెవరు చెప్పారో చెప్పగలరా.. : వర్మ


'థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు..' అని వర్మ పేర్ని నానిని విమర్శించారు. 'పేదల కోసం చేయడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు.. కానీ దానికోసం  పేదల్ని ధనికుల్ని చేయడాకి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న ధనికుల్ని పేదలను చేయకూడదు.. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.' అని వర్మ పేర్కొన్నారు.


పేర్ని నానికి ఆర్జీవీ చురకలు :


'నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వం లో ఉన్న టాప్ ఎకనామిక్స్ నిపుణులతో నేను టీవీ డిబేట్‌కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిస్ అండర్‌స్టాండింగ్ (AP Movie Tickets Issue) తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం. థ్యాంక్యూ' అంటూ ముగించారు ఆర్జీవీ.



 


Also Read: Perni Nani Counter to RGV: అది సబబేనా వర్మ గారూ.. సూటిగా, సుతిమెత్తగా పేర్ని నాని చురకలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి