Perni Nani Counter to RGV: అది సబబేనా వర్మ గారూ.. సూటిగా, సుతిమెత్తగా పేర్ని నాని చురకలు..

Perni Nani Counter to RGV : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై తెలుగు సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ విషయంలో రాంగోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలకు తాజాగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 10:58 AM IST
  • రాంగోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని కౌంటర్స్
  • ప్రజలకు మేలు చేసేందుకే టికెట్ ధరలపై నియంత్రణ అని మరోసారి స్పష్టీకరణ
  • సామాన్యుడి మోజును లూటీ చేయకుండా ఉండేందుకు చట్ట ప్రకారమే ధరలను నియంత్రిస్తున్నామన్న మంత్రి
Perni Nani Counter to RGV: అది సబబేనా వర్మ గారూ.. సూటిగా, సుతిమెత్తగా పేర్ని నాని చురకలు..

Perni Nani Counter to RGV : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై (AP Movie Ticket Price Issue) తెలుగు సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. టికెట్ ధరల తగ్గింపుపై మొదట్లో పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఆ తర్వాత హీరో నాని సైతం బాహాటంగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. ఇప్పుడీ అంశం రోజురోజుకు మరింత ముదరుతూ వస్తోంది. తాజాగా రాంగోపాల్ వర్మ ఎంట్రీతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. టికెట్ ధరలపై సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వర్మ ప్రశ్నలకు తాజాగా మంత్రి పేర్ని నాని ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.

రాంగోపాల్ వర్మకు పేర్ని నాని కౌంటర్స్ :

 

1) గౌరవనీయులైన రాంగోపాల్ వర్మ గారు.. మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్‌ను రూ.1000కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?

2) ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.

3) సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.

4) బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ?  కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.

5) సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు వర్మ గారు.

6) హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు 

7) థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి. 

8) ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు.

9) మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?

ఇక తన చివరి ట్వీట్‌లో థాంక్యూ వెరీ మచ్ అంటూ ముగించారు పేర్ని నాని. మంత్రి కౌంటర్‌పై ఆర్జీవీ (Ram Gopal Varma) ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించడాన్ని ఆర్జీవీ తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు, ప్రేక్షకుడికి మధ్య ప్రభుత్వ జోక్యమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే సామాన్య ప్రజల మేలు కోసమే తాము టికెట్ ధరలను నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా మంత్రి పేర్ని నాని ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

Also Read: Radheshyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. 'రాధేశ్యామ్' విడుదల వాయిదా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News