prisoners escape: అమరావతి: కరోనా ( Coronavirus ) మహమ్మారి అందరికీ విషాదం కల్గిస్తుంటే.. మరికొందరికీ అవకాశంగా మారుతోంది. కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే.. ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. కానీ ఇద్దరు ఖైదీలు మాత్రం.. కరోనా సోకిందని తెలిసికూడా కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ‌( Andhra Pradesh ) లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు‌ ( Eluru ) లో జరిగింది. ఈ నెల 21న జిల్లా జైలులో ఉన్న 74 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు జరపగా.. 13 మందికి కరోనా సోకినట్లు నిర్ధారన అయింది. దీంతో వారిని జైలు అధికారులు ఏలురు సమీపాన ఉన్న ఒట్లూరు కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. Also read: #Watch: పురిటినొప్పులను మించిన కష్టం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జంగారెడ్డిగూడెం, భీమవరానికి చెందిన ఇద్దరు ఖైదీలు ఇదే అదనుగా భావించి శనివారం తెల్లవారుజామున కోవిడ్‌ కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో వైద్య సిబ్బంది ఏలూరు పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఎస్కార్ట్ ఉన్నప్పటికీ వారు పారిపోవడం గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న మిగిలిన ఖైదీలకు ఎస్కార్ట్‌ను మరింత అప్రమత్తం చేశారు. Also read: Covid-19: 13 లక్షలు దాటిన కరోనా కేసులు


ఇదిలాఉంటే.. ఖైదీలు పరారైనా ఏలూరు సీఆర్‌ఆర్‌ కోవిడ్‌ సెంటర్‌ను ఎస్పీ నారాయణ నాయక్‌, జిల్లా జైలర్ వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పారిపోయిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అయితే పరారైన కరోనా సోకిన ఖైదీలతో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని, వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారోనని పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి.  Also read: Apple: భారత్‌లో ఐఫోన్‌ 11 ఉత్పత్తి ప్రారంభం