MLA Mekapati Chandrasekhar Reddy Health Update: నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా చెన్నైకు తరలించే యోచనలో కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మరించి సమాచారం అందాల్సి ఉంది. కాగా ఆయనకు గతంలోనే ఓసారి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 2019లో వైఎస్సార్సీపీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రాగా.. బెంగుళూరులోని ఆస్ట్రా వైద్యశాలకు తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆసుపత్రి నుంచే ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మేకపాటికి మరోసారి గుండెపోటు గురవ్వడం అభిమానులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బాబాయ్ అవుతారు. 


కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మొదట బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004, 2009లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయంస సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్పీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయగా.. బొల్లినేని వెంకట రామారావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. మళ్లీ అసెంబ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 


కాగా.. ఇటీవల పార్టీ విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గం (ఉదయగిరి) పరిశీలకులు ధనుంజయరెడ్డిపై ఆరోపణలు గుప్పించగా.. అధిష్టానం దిగివచ్చింది. ఆయన అభ్యర్థనను మన్నించి.. వెంటనే ధనుంజయ రెడ్డిని తప్పించింది. 


Also Read: Pension Scheme: ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. డబుల్ బెనిఫిట్ ఉండేలా ప్లాన్..!  


Also Read: RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook