RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు

RBI Hikes Repo Rate 25 Basis Points: ఆర్బీఐ మరోసారి రెపో రేట్లను పెంచింది. గతంలో కంటే తక్కువగా 25 బేస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. దీంతో ఈఎంఐలు చెల్లించే వారికి మరింత భారం పడనుంది. ప్రస్తుతం 6.25 శాతం ఉండగా.. తాజా పెంపుతో 6.50 శాతానికి చేరింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 01:58 PM IST
RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు

RBI Hikes Repo Rate 25 Basis Points: ఈఎంఐ చెల్లింపుదారులకు షాకింగ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా వరుసగా ఆరోసారి రెపో రేటును పెంచింది. అయితే ఈసారి గతంలో కంటే తక్కువగా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం 6.25 శాతం ఉండగా.. తాజా పెంపుతో 6.50 శాతానికి చేరింది. గతేడాది డిసెంబర్‌లో 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచిన విషయం తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ చివరి క్రెడిట్ పాలసీ నిర్ణయాలు ఈరోజు ప్రకటించారు. ఎంపీసీ సమావేశ ఫలితాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాచారం ఇచ్చారు. ఇందులో రెపో రేటుకు సంబంధించి రుణాల రేట్లను 0.25 శాతం పెంచారు.

ఎంపీసీ రెపో రేటును 0.25 శాతం పెంచినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఈ పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, ద్రవ్యోల్బణం గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అయితే ప్రపంచ సవాళ్లు మన ముందు ఉన్నాయన్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 7 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందన్నారు. ఆర్‌బీఐ ఎంఎస్‌ఎఫ్ రేటును 6.75 శాతానికి పెంచగా.. అది కూడా 0.25 శాతానికి పెరిగింది. ఎంఎస్ఎఫ్ 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది.

ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తే ఈఎంఐ చెల్లింపు మరింత పెరగనుంది. రెపో రేటుతో అనుసంధానించిన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెరగడంతో.. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లలో 0.25 శాతం పెరుగుదల ఉంటుంది. ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటనకు ముందు.. బ్యాంక్ నిఫ్టీలోని దాదాపు అన్ని బ్యాంక్ స్టాక్‌లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 గంటలకు బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 9 జంప్‌ను చూడగా.. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది.

రెపో రేటు అంటే.. 

బ్యాంకులకు ఆర్బీఐ నిధులు ఇస్తుంది. ఈ నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీని రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం బట్టి ఈ రెపో రేటును ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు నేరుగా ప్రజల మీదకు మళ్లించి అధిక వడ్డీలను వసూలు చేస్తాయి. అయితే వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఇక్కడితో ఆగిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   

Also Read: India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x