Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పర్యటన కొనసాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, పునరావాస ప్రాంతాల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి..నేరుగా గోకవరం సమీపంలోని ఇందుకూరుపేట పునరావాస కాలనీకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, జగ్గిరెడ్డి తదితరులున్నారు. ఇందుకూరుపేటలో ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇందుకూరుపేటలో నిర్వాసితులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు ముఖాముఖి ఏర్పాటైంది. అనంతరం నిర్వాసితుల కాలనీని సందర్శించి..బాగుందంటూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. 


పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని..కాలనీలో మెరుగైన వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్. మోదీ ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి ఉందని..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని హామీ ఇచ్చారు.ఇప్పటికే ఇందుకూరుపేట పునరావాస కాలనీలో 306 కుటుంబాలు చేరుకున్నాయి. దేవీపట్నం మండలం ఏనుగులపల్లి మంటూరు, అగ్రహారం గ్రామాల నిర్వాసితుల కోసం ఈ కాలనీ ఏర్పాటైంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీను కూడా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించి..నిర్వాసితులతో మాట్లాడారు. 


పునరావాస కాలనీ సందర్శన అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతర అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. పోలవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 


Also read: Snake Bite: బీసీ హాస్టల్‌లో పాము కలకలం.. ముగ్గురు విద్యార్ధులను కాటేసిన కట్లపాము! ఒకరు మృతి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook