AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. మూడు రాజధానుల విషయంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మరోసారి స్పష్టమైంది. కేంద్రమంత్రి ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress Party) ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకున్న కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంలను ప్రభుత్వం నిర్ణయంచింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో విచారణలో ఉంది. ఏపీ మూడు రాజధానుల అంశం(AP Three Capitals Issue)తమ పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రి రాందాస్ అథవాలే(Union minister Ramdas Athawale) స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ఎన్డీఏలో భాగస్వామి అయితే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, టూరిజం వంటి ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులకు చాలాసార్లు విజ్ఞప్తి చేశారన్నారు. రిపబ్లికన్ పార్టీ సైతం..ప్రాంతీయ పార్టీ అని..ఎన్డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. 


విశాఖపట్నంలో జరిగిన ఏపీ స్వర్ణకార సంఘం మహాసభలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైందన్నారు. ఒకవేళ నష్టాల్లో ఉన్న పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా మోదీ నేతృత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఏపీలో బలమైన పార్టీగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)పేద, బడుగు, బలహీనవర్గాలకు చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో తనకు చాలా అనుబంధముందన్నారు. 


Also read: AP Power Crisis: ఏపీలో విద్యుత్ సంక్షోభం ఉందా లేదా, విద్యుత్ శాఖ ఏం చెబుతోంది, ఏది వాస్తవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి