Unknown devotee donates varada kati hastas to Sri Venkateswara Swamy: తిరుమల (Tirumala) శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందజేశారు. వజ్రాలు, కెంపులతో పొదిగిన స్వర్ణ కటి, వరద హస్తాలను (Varada Kati Hastas) కానుకగా అందించారు. సుమారు 5.3 కిలోల బరువున్న ఈ బంగారు ఆభరణాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం (డిసెంబర్ 10) వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రంగనాయక మండపంలో టీటీడీ ఏవీ ధర్మారెడ్డికి ఆ భక్తుడు ఈ కానుకలు అందజేశారు. అయితే అతని వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆ భక్తుడు ఎవరనేది తెలియలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీవారిపై (Sri Venkateswara Swamy) భక్తితో ఇచ్చిన కానుకలకు ప్రచారం అవసరం లేదని... అందుకే తన వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు ఆ భక్తుడు టీటీడీ అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అతనికి టీటీడీ అధికారులు చిరు సత్కారం చేసినట్లు సమాచారం. అనంతరం ఆ స్వర్ణ కటి, హస్తాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ప్రస్తుతం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దాదాపు 28, 858 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 15,235 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ వ్యాక్సిన్ (Covid 19) లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాలని టీటీడీ సూచించింది.


Also Read: ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదు.. భర్తకు భారీ షాక్ ఇచ్చిన లేడీ కమెడియన్!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook