ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను.. బాంబ్ పేల్చిన ప్రముఖ లేడీ కమెడియన్! షాక్ తిన్న భర్త!!

ప్రముఖ కమెడియన్, టెలివిజన్ స్టార్ భారతీ సింగ్ ప్రస్తుతం ప్రెగ్నన్సీ అన్న విషయం తెలిసిందే. భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. భారతీ సింగ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని భారతీ సింగ్ దంపతులు తమ కొత్త యూట్యూబ్ ఛానెల్‌లో 'లైఫ్ ఆఫ్ లింబాచియాస్‌' వీడియోలో ప్రకటించారు. అయితే అసలే కమెడియన్ అయిన భారతీ.. ఆ వీడియోలో తన భర్తకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఓ బాంబ్ పేల్చింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 11:25 AM IST
  • ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను
  • బాంబ్ పేల్చిన ప్రముఖ లేడీ కమెడియన్
  • భారతీ సింగ్‌ను గట్టిగా హగ్ చేసుకున్న హర్ష్ లింబాచియా
 ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను.. బాంబ్ పేల్చిన ప్రముఖ లేడీ కమెడియన్! షాక్ తిన్న భర్త!!

Comedian Bharti Singh announce her pregnancy in a funny video: ప్రముఖ కమెడియన్, టెలివిజన్ స్టార్ భారతీ సింగ్ (Bharti Singh) ప్రస్తుతం ప్రెగ్నన్సీ (Pregnancy )అన్న విషయం తెలిసిందే. భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా (Haarsh Limbachiyaa) తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. భారతీ సింగ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని భారతీ సింగ్ దంపతులు తమ కొత్త యూట్యూబ్ ఛానెల్‌లో 'లైఫ్ ఆఫ్ లింబాచియాస్‌' వీడియోలో ప్రకటించారు. అయితే అసలే కమెడియన్ అయిన భారతీ.. ఆ వీడియోలో తన భర్తకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఓ బాంబ్ పేల్చింది. ఆ వార్త విన్న లింబాచియా భారీ షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆనందపడ్డారు. ఇంతకీ విషయంలోకి వెళితే... 

భారతీ సింగ్ (Bharti Singh), హర్ష్ లింబాచియా (Haarsh Limbachiyaa) తాజాగా ఓ వీడియో విడుదల చేయగా.. బాత్రూం సీన్‌తో ఆ వీడియో ప్రారంభమవుతుంది. గత ఆరు నెలలుగా భారతీ సింగ్ ప్రెగ్నన్సీ కోసం ఎదురుచూస్తుంటుంది. ప్రతిసారి టెస్ట్ చేసుకుని రిజల్ట్ చూసుకుని నిరాశ చెందుతుంటుంది. చివరకు తాను తల్లినవ్వబోతున్నాని తెలుసుకుని ఆనందపడుతుంది. అయితే నిద్రపోతున్న తన భర్త హర్ష్‌కి ఈ శుభవార్త చెప్పాలనుకుంటుంది. అసలే కమెడియన్ అయిన భారతీ.. హర్ష్‌ని నిద్రలేపి 'ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను' అని అంటుంది. అది విన్న లింబాచియా షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత నవ్వుకున్న భారతీ.. జోక్ చేశానని, మన పాప అని చెప్పడంతో హర్ష్ సంతోషంలో తేలియాడుతాడు. 

Also Read: Drumsticks Record Price: ఆకాశాన్నంటిన మునగకాయ ధర.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే

హర్ష్ లింబాచియా (Haarsh Limbachiyaa)తన సతీమణి భారతీ సింగ్‌ను గట్టిగా హగ్ చేసుకుని ఆనందపడుతాడు. ఆ తర్వాత లింబాచియా  కెమెరా పట్టుకుని.. 'భారతీ ఈ విషయాన్ని రికార్డ్ చేయడం మంచి విషయం. మేము పేరెంట్స్ కాబోతున్నాం. మీరందరూ ఇబ్బంది పడతారు. మాకు బిడ్డ పుట్టడం వల్ల మేం కూడా ఇబ్బంది పడతాం. నిజంగా చెపుతున్నా.. మేము చాలా సంతోషంగా ఉన్నాము' అని అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీ దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జాస్మిన్ భాసిన్, అలీ గోని, పునీత్ పాఠక్, నిధి మూనీ సింగ్ తదితరులు భారతీకి శుభాకాంక్షలు చెప్పారు. 

భారతీ సింగ్ (Bharti Singh) 2017 డిసెంబర్ 3న స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, హోస్ట్ అయిన హర్ష్ లింబాచియా (Haarsh Limbachiyaa)ను వివాహమాడింది. కామెడీ సర్కస్‌ షో కోసం పనిచేస్తున్న సమయంలో భారతీ, హర్ష్ కలిశారు. ఆ షోకు స్క్రిప్ట్ రైటర్‌గా ఉన్న హర్ష్ వయసులో భారతీ కంటే మూడేళ్లు చిన్నవాడు.  కామెడీ షోలతో పాటూ హర్ష్ 'పీఎం నరేంద్ర మోదీ' సినిమాకు డైలాగులు రాశాడు. మలంగ్ సినిమాకు టైటిల్ ట్రాక్ కూడా రాశాడు.  'ఖత్రా, ఖత్రా, ఖత్రా', 'హమ్ తుమ్', 'క్వారంటీన్ షాట్' లాంటి షోలకు నిర్మాతగా వ్యవహరించాడు. 

Also Read: Omicron scare: వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే రేషన్ షాప్స్​ నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ..!

మరోవైపు భారతీ సింగ్ (Bharti Singh) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1984 జులై 3న పుట్టింది. ఆమెకు రెండేళ్ల వయసులో తండ్రి మరణించారు. ఆమె  తండ్రి నేపాలీ సంతతికి చెందినవారు కాగా తల్లి పంజాబీ. ఆమె బాల్యం పూర్తిగా పేదరికంలో గడిచింది. దాని గురించి ఆమె చాలాసార్లు తన ఇంటర్వ్యూల్లో చెప్పింది. అమృత్‌సర్‌లో కాలేజీ రోజుల్లోనే ఆమెకు ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ తెలుసు. అతడే ఆమెకు  కెరీర్ చూపించాడు. భారతీ 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్' రియాలిటీ షోతో తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత 'కామెడీ సర్కస్-3కా తడ్కా'లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె దాదాపు ప్రతి కామెడీ షోలో కనిపించి పాపులర్ అయింది. చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా పనిచేశారు. భారతీ కమెడియన్ మాత్రమే కాదు షూటింగ్, విలువిద్యలో కూడా నైపుణ్యం ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

 

Trending News