AP Govt: నిరుద్యోగులకు శుభవార్త..కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!
AP Govt: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వయో పరిమితిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి అమలులోకి రానుంది.
AP Govt: ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా నేరుగా రిక్రూట్ చేసే యూనిఫాం పోస్టుల గరిష్ఠ వయో పరిమితిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వయో పరిమితిని రెండేళ్లకు పెంచారు. గతంలో పెంచిన వయో పరిమితి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మళ్లీ పెంచారు. అటవీ, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, రవాణా శాఖల్లో యూనిఫాం పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు ఇది వర్తించనుంది. ఓసీలకు 26 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 31 ఏళ్ల వరకూ ఉంటుంది.
ఇటు వీఆర్‌వోలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని గ్రేడ్-1, 2 గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం మరింత భరోసాను ఇచ్చింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్-1, 2 వీఆర్‌వోలు చనిపోతే వారి కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం ల్పించారు. ఈమేరకు ఏపీ వీఆర్‌వో సర్వీస్ నిబంధనలు-2008లో మార్పులు చేర్పులు చేశారు. ఈమేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులోభాగంగానే గ్రేడ్-1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన వారికి కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్ లేదా క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు. కారుణ్య నియామకాలను ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై గత టీడీపీ ప్రభుత్వం ఎన్నాడూ పట్టించుకోలేదు. సీఎం జగన్..వీఆర్‌వోల సమస్యలపై దృష్టి పెట్టారు. తాజాగా వారి సమస్యకు పరిష్కారం చూపారు.
దీనిపై ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు..సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also read:మింగుతా, సింగుతా అంటూ దారితప్పుతోన్న జబర్దస్త్.. డబుల్ మీనింగ్ డైలాగ్‌తో సింగర్ మనో
Also read:Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్ ఆశలు గల్లంతు!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.