దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య జనవరి 19 న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలు టైమింగ్స్ ఎప్పుడనేది తెలిసిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య పరుగులు తీసేందుకు సిద్ధమైంది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న వేగవంతమైన రైళ్లలో దురంతో మొదటి స్థానంలో ఉంది. ఈ రైలు 10.10 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఆ తరువాత గరీబ్‌రధ్ 11.10 గంటలు, ఫలక్‌నుమా 11.25 గంటలు, గోదావరి 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ 12.40 గంటల సమయం తీసుకుంటున్నాయి. 


వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర ఎంత


ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అన్నింటికంటే వేగంగా కేవలం 8.40 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. అంటే  699 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 40 నిమిషాల్లోనే ఈ రైలు ఛేదిస్తుంది. ఈ రైలు ఛార్జీలు ఇతర రైళ్లతో పోలిస్తే కాస్త అధికంగానే ఉంటాయి. ఎంతనేది ఇంకా నిర్ణయించకోపోయినా..దాదాపు ఇంతే దూరం 655 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ జమ్మూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ధరల్ని బట్టి అంచనా వేయవచ్చు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు చైర్‌కార్ టికెట్ 1665 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ ధర 3055 రూపాయలుంది. ఢిల్లీ-జమ్మూ కంటే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య దూరం మరో 44 కిలోమీటర్లు ఎక్కువ కాబట్టి..టికెట్ ధర 50-100 రూపాయలు పెరగవచ్చు. 


విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ టైమింగ్స్ ఇలా


విశాఖపట్నంలో ఉదయం   5.45 
రాజమండ్రికి                        8.08-8.10 
విజయవాడ                          9.50-9.55
వరంగల్                              12.05-12.07
సికింద్రాబాద్                        14.25


సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ టైమింగ్స్


సికింద్రాబాద్       మద్యాహ్నం                14.45
వరంగల్                                                16.25-16.27
విజయవాడ                                            19.10-19.15
రాజమండ్రి                                             21.15-21.17
విశాఖపట్నం                                          23.25


వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రతి రోజూ తిరుగుతుంది. ప్రస్తుతానికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ప్రాధమికంగా నిర్ణయించినవే. తుది టైమ్ టైబుల్ ఇంకా వెలువడాల్సి ఉంది. 


Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook