ఓ వైపు సుప్రీంకోర్టు కొలీజియంపై విమర్శలు వస్తున్నా..తనపని తాను చేసుకుపోతోంది సుప్రీంకోర్టు కొలీజియం. ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
ఏపీ హైకోర్టులో ఖాళీలు పూర్తవుతున్నాయి. 37 మంది న్యాయమూర్తులుండాల్సిన ఏపీ హైకోర్టులో ఇప్పటికే 30 మంది ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. ఈ రెండు పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా 5 హైకోర్టులకు 9 మంది పేర్లను న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఇందులో కర్ణాటక హైకోర్టుకు ముగ్గురు, ఏపీ, మణిపూర్ హైకోర్టులకు ఇద్దరేసి, బోంబే, గువహతి హైకోర్టులకు ఒక్కొక్కరి చొప్పున సిఫారసు చేసింది. ఇందులో ఏపీ హైకోర్టుకు ప్రస్తుతం న్యాయాధికారులుగా పనిచేస్తున్న పి వెంకట జ్యోతిర్మయి, వి గోపాలకృష్ణారావు పేర్లను సిఫారసు చేసింది.
పి వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గంటూరు జిల్లా తెనాలి. నాగార్జున యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 2008లో జిల్లా జడ్జి క్యాడర్‌లో ఎంపికయ్యారు. ఫ్యామిలీ, ఎస్సీఎస్టీ, సీబీఐ కోర్టుల్లో పనిచేశారు. ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పీడీజేగా ఉన్నారు.
వి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా. ప్రస్తుతం గుంటూరు జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా ఉన్నారు. అవనిగడ్డ బాస్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1994లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. గతంలో శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook