టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదిగా మరో మారు విజయసాయిరెడ్డి విమర్శలు సంధించారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు  పర్యటిస్తున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ సైటైర్లు సంధించారు. నారా వారంటే వరుణిడికే కాదు వరదలకూ భయమే అంటూ ఎద్దేవ చేశారు. ముంపు ప్రాంతాలను పర్యటిస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే వరద నిలిచి పోయిందని.... డ్యాముల గేట్లన్నీ మూతపడ్డాయన్నారు. ఇంతకూ చంద్రబాబు పరామర్శించేదెవరినో ? ....మీ ఇల్లే మునిగి పోయిందట. ఇక మాకేం ధైర్యం చెబ్తారయ్యా అని బాధితులంతా ఆయన్నే ఓదార్చే పరిస్థితి నెలకొందని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్థ్రాలు సంధించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అవినీతి కేసులకు బాబు భయపడుతున్నారు
ఇదే సందర్భంలో టీడీపీ నుంచి వలసలను విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ తన పార్టీ నేతలంతా క్యూకట్టి మరి బిజెపిలో చేరుతున్నా ఏం అనలేని  దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. వలసలను నిలువరిస్తే అమిత్ షా గారికి కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికి పోతున్నారని అందుకే  పార్టీ వదిలి వెళ్తున్న నేతలను నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని ఎద్దేవ చేశారు.ఇదంతా ఎందుకుంటే ...తన అవినీతి కేసులు తిరగ తోడతారనే భయం.. అందుకే చంద్రబాబు ఇలా సైలెంట్ అయ్యారని విజయసాయరెడ్డి విమర్శలు సంధించారు.