KTR Fires On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కందుకూరు రైతు ధర్నా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. మర్యాద ఇచ్చే వారికి మర్యాద ఇవ్వాలని.. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయని ఏ ముఖ్యమంత్రి అయినా అడుగుతారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేదన్నారు. కుర్చీని కాపాడుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. రైతుల ధర్నాను ఢిల్లీలో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. ఉన్న ఇళ్లు కూలగొట్టే పని రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని మండిపడ్డారు. తులం బంగారం ఇచ్చుడు లేదు కానీ.. మూసీకి లక్షా 50 వేల కోట్లా..? అని నిలదీశారు.
Also Read: Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!
మూసీ పేరు మీద 30 వేల కోట్లు వెనుకేసి ఢిల్లీకి మూటలు పంపాలని చూస్తున్నాడు. నేను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించాను. ఫార్మా సిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అంటున్నారు. ఉన్న సిటీని మెయింటెన్ చేయడం చేతకాదు కానీ ఊహల సిటీ అంటున్నారు. కేంద్రం సహకారంతో ఆర్ఆర్ఆర్ తీసుకువచ్చాము. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పని చేస్తున్నారు. మూసీ మురికి అంతా ముఖ్యమంత్రి నోట్లోనే ఉంది. నాపైన అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. సివిల్, క్రిమినల్ కేసులు పెడతా..
మూసీ నిర్వాసితులను ఆక్రమణదారులు అని సీఎం అంటున్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తా అని అంటున్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది కూలగొట్టు. సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కట్టాలి. అవసరం అయితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చందాలు వేసుకొని కప్పం కడతాం.. పేదల జోలికి పోకు. మిత్తితో సహా పథకాలను రేవంత్ రెడ్డి ప్రజలకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి పాలనలో బతుకమ్మ చీరలు రావు. సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే తట్టుకోలేక రేవంత్ రెడ్డి అవమానించారు.
దమ్ముంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీ లేకుండా ఊళ్లకు రా. రాష్ట్రంలో ఎక్కడా సంపూర్ణ రుణమాఫీ కాలేదు. సంవత్సరం కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 40 వేల కోట్ల నుంచి 7 వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ అయింది. తెలంగాణలో ఎక్కడా కాంగ్రెస్ నాయకులు తిరగలేని పరిస్థితి వస్తుంది. కందుకూరు నుంచి మెట్రో తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కందుకూరుకు కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ 200 కోట్లు మంజూరు చేస్తే రేవంత్ రెడ్డి రద్దు చేశారు. మంత్రుల బలుపు మాటలు ప్రజలు గమనిస్తున్నారు. రైతులు తిరగబడితే ఏ ప్రభుత్వానికి ఆయినా ఓటమి ఖాయం." అని కేటీఆర్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter