Vijayawada Doctor Family Suicide: ఘోరం చోటు చేసుకుంది ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన డాక్టర్ కుటుంబం నిండు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో సహ ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.  వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ (40) తోపాటు అతని కుటుంబ సభ్యులు మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం అప్పుల బాధలు తాళలేకే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల వివరాల ప్రకారం మృతుడు డాక్టర్‌ శ్రీనివాస్ మృతదేహం ఆరుబయట ఉరి వేసుకుని చనిపోయి ఉండగా అతని భార్య ఉషారాణి (36), తల్లి రమణమ్మ (65), కూతురు శైలజ (9), శ్రీహాన్ (5) ఇంట్లో మృతి చెంది ఉన్నారు. 


ఇదీ చదవండి: హైకోర్టుకు చేరిన గాజు గ్లాసు పంచాయితీ, రేపటికి వాయిదా


మృతుడు శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ హాస్పిటల్‌ యజమాని ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఆత్మహత్యలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే, చనిపోయిన శ్రీనివాస్ తన కుటుంబ సభ్యలను చంపి ఆ తర్వాత తాను ఉరేసుకుని చనిపోయాడా? లేదా అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? తెలియాల్సి ఉంది.


 అయితే, విజయవాడలో శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనే శ్రీజ హాస్పిటల్‌ యజమాని కూడా. ఈ నేపథ్యంలో మృతుడు శ్రీనివాస్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.  అందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం గొంతుపై కత్తితో కోయడంతో చనిపోయారు. శ్రీనివాస్ మాత్రం ఇంటి బయట ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులక వల్లే కుటుంబ సభ్యులను చంపి, తాను ఉరేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు ఫైల్ చేసుకన్న పోలీసులు వివరాలపై తీవ్రంగా ఆరాతీస్తున్నారు. మొత్తానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తాళలేక ఓ వైద్యుడి కుటుంబం మాత్రం తమ నిండు ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


ఇదీ చదవండి: వందేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఏపీలో రెడ్ అలర్ట్ జారీ


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook