Summer Weather Report: రోజురోజూకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో ఏప్రిల్ నెల అతి కష్టంగా గడిచింది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు గత వందేళ్లలో అత్యధికమని తెలుస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది.
1921-2024 ఏప్రిల్ నెలలో దాదాపు 103 ఏళ్ల డేటా ప్రకారం ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ నమోదైంది. ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకోవడం ఇదే తొలిసారి. రానున్న ఐదురోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం వేడి గాలులు వీయనున్నాయి. మే నెలలో గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ఓ సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే రెండో దశ పోలింగ్‌పై ఎండల ప్రభావం పడినట్టు ఎన్నికల అదికారుల దృష్టికి వచ్చింది. ఇక మే నెలలో జరిగే మిగిలిన 5 దశల పోలింగ్ పై కూడా ఎండల ప్రభావం ఉండవచ్చు. ఓటింగ్ తగ్గే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
వేడి గాలుల ఇండెక్స్ అయితే 40-50 డిగ్రీల వరకూ కన్పిస్తోంది. కేరళతో పాటు కొన్ని తూర్పు తీర ప్రాంతాల్లో అయితే వేడి గాలుల సూచీ ఏకంగా 50-60 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింగది. రానున్న 1-2 రోజుల్లో దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 1-2 డిగ్రీలు పెరగవచ్చు. అదే 5 రోజుల్లో అయితే గరిష్ఠ ఉష్ణోగ్రత 2-4 డిగ్రీలు పెరిగే అవకాశముంది. ఇక తమిళనాడు, ఏపీ, తెలంగాణలో అయితే గరిష్ఠ ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరగనుందని అంచనా.
దేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కాగా ఉప హిమాలయ ప్రాంతంలోని బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్ణాటకలో ఆరెంజ్ అలర్డ్ జారీ అయింది. మే నెలలో వీలైనంతవరకూ ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండి కిటికీలు, తలుపులు మూసి ఉంచుకోవాలి. సాధ్యమైనంతవరకూ వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి.
Also read: Asaduddin Owaisi: ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook