500Kg Rotten Meat in Vijayawada Meat Shops: విజయవాడలోని మాంసం షాపుల్లో  మాంసం కొనుగోలు చేయాలంటేనే అక్కడి ప్రజలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా కొందరు వ్యాపారుల తీరులో మార్పు రావట్లేదు. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిర్వహించిన దాడుల్లో దాదాపు 500 కేజీల కుళ్లిపోయిన మాంసం బయటపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం (సెప్టెంబర్ 4) తెల్లవారుజాము నుంచే మున్సిపల్ అధికారులు విజయవాడలోని మాంసం షాపులపై దాడులు నిర్వహించారు. ప్రకాష్ నగర్, మాచవరం, కొత్తపేట, బీఆర్టీఎస్ మార్కెట్లలోని మాంసం షాపుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా 500 కేజీల కుళ్లిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ కుళ్లిన మాంసాన్ని ఉత్తరాది నుంచి ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


ప్రజలు మాంసపు షాపుల్లో మాంసం కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. షాపు, మాంసం శుభ్రంగా ఉందా లేదా చూసుకోవాలన్నారు. గతంలోనూ రైలు వ్యాగన్లలో విజయవాడకు చేరిన 2,3 టన్నుల మాంసాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారానే కుళ్లిన మాంసాన్ని విజయవాడ మార్కెట్లకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. 


కొన్ని షాపుల్లో పురుగులు పట్టిపోయి అత్యంత దుర్గంధం వెదజలుతున్న మాంసాన్ని అధికారులు గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని మంచి మాంసంతో కలిపి అమ్మడం లేదా తక్కువ ధరకు విక్రయించడం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి దందాలు ఇకనైనా మానుకోవాలని సూచిస్తున్నారు. కాగా, గత ఆదివారం కూడా విజయవాడ మాంసం దుకాణాల్లో దాదాపు 100 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. 


Also Read:Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?


Also Read: MLA Gadari Kishore:నా  సభకు వస్తేనే పెన్షన్‌‌ ఇవ్వు.. లేదంటే లాగు పగుల్తది! గ్రామ కార్యదర్శికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook