MLA Gadari Kishore: నా సభకు వస్తేనే పెన్షన్‌‌ ఇవ్వు.. లేదంటే లాగు పగుల్తది! గ్రామ కార్యదర్శికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

MLA Gadari Kishore: తెలంగాణలో అధికార పార్టీ నేతలు నోరు జారుతున్నారు. జనం ముందే బరి తెగిస్తున్నారు.ఇటీవలే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బరి తెగించారు.

Written by - Srisailam | Last Updated : Sep 4, 2022, 11:26 AM IST
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
  • గ్రామ కార్యదర్శిైప పరుష పదజాలం
  • వైరల్ గా మారిన ఎమ్మెల్యే వీడియో
MLA Gadari Kishore: నా  సభకు వస్తేనే పెన్షన్‌‌ ఇవ్వు.. లేదంటే లాగు పగుల్తది! గ్రామ కార్యదర్శికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

MLA Gadari Kishore: తెలంగాణలో అధికార పార్టీ నేతలు నోరు జారుతున్నారు. జనం ముందే బరి తెగిస్తున్నారు. బండ బూతులకు దిగుతున్నారు. ప్రభుత్వ పథకాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారులపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఎంపికకు సంబంధించి ఇటీవలే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలకే హౌజింగ్ స్కీమ్ ఇస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎమ్మెల్సీ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. తమ మాటలు రచ్చరచ్చవుతున్నా గులాబీ లీడర్లు మాత్రం మారడం లేదు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బరి తెగించారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గ్రామ సభలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ కార్యదర్శిపై తీవ్రంగా మాట్లాడారు. శాలిగౌరారం మండలం వల్లాలలో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వచ్చారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కొందరు లబ్ధిదారులు రాకపోవడంతో గ్రామ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సభకు వచ్చిన వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలా కాకుండా మీటింగ్ కు రాని వారికి ఎవరికైనా పెన్షన్ ఇస్తే లాగు పగుల్తది అంటూ జనం ముందే గ్రామ కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News