Vizag Steel Plant: ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్.. మళ్లీ కదం తొక్కనున్న విశాఖ ఉక్కు కార్మికులు
Vizag Steel Plant Agitation: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.
Vizag Steel Plant Agitation: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అలాగే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 12న 365 మంది కార్మికులతో నిరాహార దీక్ష, ఫిబ్రవరి 13న బైక్ యాత్ర, అదే రోజు బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నిర్ణయించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను (Vizag Steel Plant Privatisation) వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఏడాది కాలంగా స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కార్మికులు ఎంతో ఓపికగా ఉద్యమం చేస్తున్నారని.. తమ సహనాన్ని కేంద్రం అలుసుగా తీసుకోవద్దని వారు హెచ్చరించారు. కార్మికులు తిరగబడితే రణరంగమేనని... ఇప్పటికైనా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని (Vizag Steel Plant Privatisation) గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి విశాఖలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతేడాదే ఏపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇదే అంశంపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్టీల్ ప్లాంట్ పరిరక్ష సమితి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. దీంతో మున్ముందు ఉక్కు ఉద్యమం ఏపీలో కాక రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. భువీ, వెంకీ ఔట్! నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా!!
Also read: Todays Gold Price: తగ్గిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook