Todays Gold Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్గించే అంశం. బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న ధరల్లో తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో పరిశీలిద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 8 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 530 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 530 రూపాయలుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 880 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 50 రూపాయలుగా ఉంది. ఇక పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 7 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 4 వందలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Also read: Xiaomi 12 Ultra: షియోమీ 12 అల్ట్రా ఫోన్ విడుదలకు ముందే ఫీచర్లు లీక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook