Visakha Murder Case: విశాఖలో దారుణం.. బంగారం కోసం హత్య చేసిన వాలంటీర్
Volunteer Kills Old Woman: విశాఖలో బంగారం కోసం వాలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇచ్చిన మహిళనే హత్య చేసి బంగారు నగలతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Volunteer Kills Old Woman: విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన పెందుర్తి పరిధిలో చోటుచేసుకోగా.. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు ఇలా.. విశాఖ పరిధిలోని 95వ వారు పురుషోత్తపురం పరిధిలో వెంకటేశ్ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వరలక్ష్మి (75) అనే మహిళ షాప్‌లో గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్‌గానూ పనిచేస్తున్నాడు. ఆమె బంగారంపై కన్నేసిన వెంకటేశ్ ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఆమెను హత్య చేశాడు. ఒంటిపై ఉన్న బంగారంతో పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వృద్ధురాలిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి.. ఆధారాలు సేకరించారు. దిండుతో ముఖంపై అదిమినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నిందితుడు వెంకటేశ్ నిన్న రాత్రి అపార్ట్‌మెంట్ లోపలకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫులేజ్ ఆధారంగా నిందితుడిని ఆచూకీ కనిపిపెట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
విశాఖ బీచ్‌రోడ్డులోని రుషికొండ సమీపంలో పర్యాటక బోటుకు ప్రమాదం తప్పింది. కెరటాల తాకిడితో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇద్దరు టూరిస్టులతో వెళుతున్న స్పీడ్ బోటు.. అలల ఉధృతికి బోల్తా పడిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు బోటు ఉండగా.. అందరూ లైఫ్ జాకెట్లు ధరించడంతో క్షేమంగా బయటపడ్డారు. బీచ్‌కు 150 మీటర్ల దూరంలో ప్రమాదం జరగ్గా.. రుషికొండ మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డులు, మత్స్యకారులు వెంటనే అక్కడికి వెళ్లి పర్యాటకులను రక్షించారు.
Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
Also Read: IPL 2024: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. విదేశీ గడ్డపై ఐపీఎల్ 2024..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి