JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. ఏదో గేటు దగ్గర కాపలా అయినా కాస్తా.. ఎవరికీ లొంగను: జేసీ ప్రభాకర్ రెడ్డి

Ex MLA JC Prabhakar Reddy: తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా.. వెనక్కి తగ్గేదేలే అన్నారు. ఆయన ఏం చెప్పారంటే..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 31, 2023, 08:01 AM IST
JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. ఏదో గేటు దగ్గర కాపలా అయినా కాస్తా.. ఎవరికీ లొంగను: జేసీ ప్రభాకర్ రెడ్డి

Ex MLA JC Prabhakar Reddy News: మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఎంతో మారిపోయాయని వెల్లడించారు. తన ఆర్థిక మూలాలు అన్నీ దెబ్బ తీశారని.. అయినా తగ్గేదేలే అన్నారు. ఏదో ఒక లారీ క్లీనర్ పని అయినా చేసుకుంటానని.. లేదంటే ఓ గేటు దగ్గర కాపాలాగా అయినా ఉంటాను గానీ ఎవరికీ లొంగనని స్పష్టం చేశారు. ఆర్థికంగా తనను దెబ్బ తీస్తే.. లొంగుతానని అనుకున్నారని తాను మాత్రం వెనక్కి తగ్గనని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాడిపత్రి ప్రజలకు అండగానే ఉంటానన్నారు.

"వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. నేను ఇలా మారడానికి కారణం ఒక విధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. గతంలో నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి వెళ్లారు.. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా.. అవి పనిచేయలేదు. నా పరిస్థితి ఏంటి అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్లేసరికి ఉరి వేసుకోవాలని అనిపించింది. లేదంటే ఊరు వదిలి పారిపోవాలి అనుకున్నా.. అన్ని కాదని అనుకుంటే.. ఎమ్మెల్యేకు కప్పం కట్టి..  లొంగిపోయి బతకాలి. ఆ రోజు నేను ఇంటికి వెళ్లే సమయానికి కార్యకర్తలు వచ్చారు. చివరకు 

ఒకసారి పెద్దారెడ్డి కొడుకు ప్రమాదంలో ఉంటే నేనే రక్షించాను. నాలో చాలా మార్పు వచ్చింది. ఏదో ఇంత అన్నం తింటే చాలనే పరిస్థితికి వచ్చేశా.. అలాగని ఎవరికీ లొంగి బతికే పరిస్థితి లేదు. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా.. నేను మాత్రం వెనక్కి తగ్గేదేలేదు. క్లీనర్‌ పని అయినా చేస్తా. నాకు ఉన్న అనుభవంతో ఏ వర్క్‌షాపులోకి పోయినా కూర్చోబెడతారు. ఏదో ఒక గేటు దగ్గర కాపలా అయినా కాస్తా.. అంతేగానీ ఎవరికీ లొంగిపోను. నా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే.. లొంగుతారనని అనుకున్నారు. నేను వెనుకడుగు వేయను.." అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. 

తమ ప్రాంతంలో ఐదేళ్లకు ఒకసారి వర్షాలు కురుస్తాయని.. తినడానికి తిండిలేకపోవడంతోనే తాము ఫ్యాక్షన్ చేశామన్నారు. తమకు స్వాతంత్య్రానికి పూర్వం నుంచే బస్సులు ఉన్నాయని.. వాటిని కూడా సీజ్‌ చేశారని చెప్పారు. తనపై 74 కేసులు పెట్టారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అన్నారు. జేసీ పవన్ రెడ్డికి ఎంపీగా టికెట్ బరిలో నిలబడతారని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు ఎవరు బయటకు రావడం లేదని.. ఎంతో కొంత మాట్లాడుతోంది తానేనని అన్నారు. జిల్లా మొత్తం తనను ఎందుకు తిప్పడం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. 

 

Trending News