Vishakapatnam Rape Incident: నోట్లో గుడ్డలు కుక్కి, పెదాలు కొరికేసి.. 11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం
Vishakapatnam Nakkapallli Rape Incident: బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన బొడ్డు నాగేష్ (22) అనే యువకుడు ఆమె వద్దకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లాడు. బాలిక ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Vishakapatnam Nakkapallli Rape Incident: విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల మైనర్ బాలికపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జీడితోటలో వంట చెరుకు కోసం వెళ్లిన బాలికను బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. వద్దన్నా.. అంటూ ఆ బాలిక అతన్ని వేడుకున్నా కనికరించలేదు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే... విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన ఓ బాలిక (11) స్థానిక ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటోంది. ఇటీవల ఓరోజు స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక.. వంట చెరుకు తీసుకొచ్చేందుకు అక్కతో కలిసి సమీపంలోని జీడి తోటకు వెళ్లింది. కాసేపటికి అక్క అక్కడి నుంచి వెళ్లిపోగా ఆ బాలిక ఒక్కరే వంట చెరుకును సేకరిస్తూ ఉండిపోయింది.
బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన గొడ్డు నాగేష్ (22) అనే యువకుడు ఆమె వద్దకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లాడు. వద్దన్నా.. అంటూ బాలిక అతని కాళ్లా వేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు. బాలిక ప్రతిఘటించడంతో నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పెదాలు కొరికేసి, ఒళ్లంతా గాయాలు చేశాడు. అత్యాచార విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడు. లైంగిక దాడి అనంతరం రాత్రి 9గం. సమయంలో ఆమెను ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిపోయాడు.
కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో అప్పటికే బాధిత బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయం చెప్పడంతో వారు షాక్ తిన్నారు. వెంటనే బాలికను వెంటపెట్టుకుని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అత్యాచార ఘటనపై స్థానిక జనసేన నేత ఒకరు మాట్లాడుతూ... నిందితుడు నాగేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు (Rape Incident) న్యాయం జరిగేవరకు ఆమెకు అండగా నిలుస్తామన్నారు. మరొకరు ఇలాంటి పనులు చేసేందుకు భయపడేలా నిందితుడికి శిక్ష విధించాలన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక జడ్పీటీసీ డిమాండ్ చేశారు.
Also Read : Rains in Telangana: వెదర్ అలర్ట్.. తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook